అత్యవసర చికిత్స గోల్డెన్ అవర్ లో ఆస్పత్రిలో పరికరాలు అత్యవసరం..

Equipment is urgent in the hospital during the golden hour of emergency treatment.– ఉచితంగా అందచేయడం అభినందనియం..
– ట్రామా కేర్ కోసం ప్రత్యేక కృషి..
– ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ…
నవతెలంగాణ – డిచ్ పల్లి
రోడ్డు ప్రమాద బారిన పడిన రోగులకు అత్యవసర చికిత్స గోల్డెన్ అవర్ లో పరికరాలు ఎంతగానో ఉపయోగ పడుతుందని, గోల్డెన్ అవర్ లో చికిత్స తక్కువ సమయంలో అందినట్లయితే మరణం అవకాశం తక్కువగా ఉంటుందని, మానవతా దృక్పథంతో అలోచించి ఇలాంటి పరికరాలను ఆసుపత్రి కి అందజేయడం అబినందనమని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ పేర్కొన్నారు. బుదవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  అత్హంగ్ డిచ్ పల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు  ఐదు లక్షల రూపాయల విలువైన పరికరాలను ఉచితంగా అందజేశారు. ఈ పరికరాలలో ఈసీజీ మిషన్ 5 పారామీటర్,  ల్యాబ్ అనలైజర్ లాంటి పరికరాలు ఉన్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణాల రేటు తగ్గిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జనాభాకు సరిపడా వాహనాల కంటే ఎక్కువ ఉన్నాయని దాదాపు నాలుగున్నర లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నాయని,దింతో రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువగా జరిగా అవకాశం ఉందన్నారు. జాతియ రాహదరి 44 రోడ్డు ప్రక్కన ఉన్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎళ్ళవేళల  అండగా ఉంటామని ఇంకా పరికరాలు అవసరమైతే ఇస్తామని తెలిపారు.కామరెడ్డి, నిజామాబాద్ జిల్లాల మద్యలో ఇందల్ వాయి ఉందని ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ నేలా కోల్పడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు నారాయణ తెలిపారు.ఈ పరికరాలను రోడ్డు ప్రమాదంలో గాయాపడిన రోగులకు ఉపయోగించాలని టోల్ ప్లాజా ప్రాజేక్ట్ మేనేజర్  అనిల్ సింగ్, టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు అన్నారు.ఇంతకు ముందు లక్షల రూపాయల విలువైన వస్తువులు ఆసుపత్రి కి అందజేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో అత్హంగ్ డిచ్ పల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సాద్యమైనంత వరకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు.డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే రోగులకు వేచి ఉండు గది నిర్మాణం చేపట్టాలని ఆసుపత్రి కి లక్షల రూపాయల విలువైన పరికరాలను ఉచితంగా అందజేయడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని వివరించారు ప్లాజా మేనేజర్  వెంటనే స్పందించి తమవంతుగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఆర్డిఏ వర్ష, ఆపరేషన్ మేనేజర్ విరాజ్ దేశ్ పాండే,సెప్టి మేనేజర్ సతీష్, డాక్టర్ సుశాంత్ రెడ్డి, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ సంతోష్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాల, టోల్ ప్లాజా, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.