– సీడీపీఓ ప్రియదర్శిని
నవతెలంగాణ-కుల్కచర్ల
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడీపీఓ పియదర్శి, ఎంపీపీ సత్యమ్మ, ఐసీడీఎస్ సూప ర్‌వైజర్లు యాదమ్మ, అంజమ్మ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండలం ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ…మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అమ్మాయికి 21 ఏళ్లు పూర్తి అయ్యే వరకు వివాహం చేయరాదని అలా చేస్తే చేసిన వారికి చేయించిన వారికి కఠినంగా శిక్ష పడుతుం దన్నారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ ఆంజనేయులు, జడ్పీటీసీ రాందాస్ నాయక్, స్థానిక ఎస్‌ఐ శ్రీశైలం, తహసీ ల్దార్ రమేష్, చెల్డలైన్ ఇన్‌చార్జ్ ఘనపూరం రాంచెంద్ర య్య, కుల్కచర్ల, ముజాహిద్ పూర్, చౌడాపూర్ సెక్టర్ల అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.