
నవతెలంగాణ – తాడ్వాయి
కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం అని, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ (డిపిఎంఓ) నీరటి సంజీవరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్యాధికారి చిరంజీవి ఆధ్వర్యంలో విద్యార్థినీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థినిలకు, కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు, ఎదపై, నొప్పిలేని బొడిపెలు, కనుబొమ్మల రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూత పడకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు చేతులు తిమ్మర్లు, అరికాలు అరిచేతులలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించకపోవడం చేతుల నుంచి వస్తువులు జారిపోవడం చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు వంకర్లు తిరగడం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ చేస్తారని అన్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని నరాలను ప్రభావితం చేస్తుందన్నారు. కుష్టు వ్యాధి పై అవగాహన పెంచుకోవాలని వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేయాలన్నారు. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్ రాకుండా నివారించవచ్చు అన్నారు. చెర్రీంపై ఉన్న తెల్లని రాగి రంగు మచ్చలు కలిగి ఉండి స్పర్శన్ కోల్పోయి ఉన్నట్లయితే లేప్రోస్ లక్షణాలుగా ఉన్నట్లుగా భావించి దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఇర్ప పుష్పనీలా, ఉపాధ్యాయురాన్లు, ఏఎన్ఎం మంగమ్మ, హెచ్ ఏ జయరాం, ఆశా పద్మ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
