నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
ప్లాస్టిక్ వాడకంతో ఎక్కువ అనర్ధాలు కలుగుతున్నాయని ప్లాస్టిక్ నిర్మూలన మనందరి బాధ్యతని ఎన్‌సిసి అధికారి గుండెల్లి రాజయ్య అన్నారు. పరిసరాల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పదవ బెటాలియన్ కమాండింగ్ ఆఫిసర్ కల్నల్ అజరు నంద కందూరి ఆదేశాల మేరకు ఎన్సీసి ఆఫిసర్ రాజయ్య ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని మొట్లపల్లి జెడ్పిహెచ్ ఎస్ పాఠశాల ఎన్సీసి విద్యార్థులతో గ్రామంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకంతో భూమి కలుషిత మవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో వాతావ రణం తీవ్రంగా కలుషితమవుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో భూమి సారవం తంను కోల్పోతుందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, క్లాత్ సంచులు, కాగితపు సంచులు వాడడంతో పాటు ఎక్కువ మొత్తంలో చెట్లను నాటి పరిరక్షించాలన్నారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు నరసింహ స్వామి, సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ కల్పనా సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ విష్ణు, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు సంపత్ కుమార్, వీరయ్య, రవీందర్ గ్రామస్తులు, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.