– ప్రతినెలా 20వ తేదీ డిస్కంలకు సబ్సిడీ చెల్లించాలని షరతు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి స్కీంకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీం ఆమోదం కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు దరఖాస్తుచేసుకున్న విషయం తెలిసిందే. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామనీ, ఆ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రతినెలా 20వతేదీ నాటికి డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాలని షరతు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గృహ విద్యుత్‌ను ఇతర అవసరాల కోసం వినియోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.