రాష్ట్రస్థాయి బహుమతులు అందుకున్న ఏర్గట్ల విద్యార్థులు

Ergatla students who received state level prizesనవతెలంగాణ – ఏర్గట్ల
నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వము,తెలంగాణ సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కథలు,వచన కవిత్వ పోటీల్లో, ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అభిలాష్ 3 వేల రూపాయల నగదు బహుమతి,వైష్ణవి,నూనె శ్రీనిధి లకు ప్రోత్సాహక బహుమతులతో పాటు రూ.1000 నగదు బహుమతులు లభించినట్లు తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి అందెశ్రీ,తెలంగాణ సాహిత్య సంగీత అకాడమీ చైర్మన్ అలేఖ్య వచ్చారని,వారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం జరిగిందని అన్నారు.రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, ఉపాధ్యాయులు అభినందించారు.