
నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొరిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు ఎర్ర సబిత శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికను తొర్రూరు ఆర్డీవో నర్సింహా రావు సమక్షంలో చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 24 వ తేదీన నూతన ఎంపీపీ ఎన్నికను నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్దవంగర ఎంపీపీ గా ఎర్ర సబిత ఎన్నికైనట్లు ఆర్డీవో తెలిపారు. కాగా మండలంలో 9 ఎంపీటీసీ సభ్యుల్లో గతంలో పెద్దవంగర ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు. వడ్డెకొత్తపల్లి ఎంపీటీసీ సభ్యులు సాయిని ఝాన్సీ, చిట్యాల ఎంపీటీసీ ఈదురు రాజేశ్వరి ఇద్దరు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. బొమ్మకల్ ఎంపీటీసీ బానోత్ రవీందర్ నాయక్, చిన్నవంగర ఎంపీటీసీ మెట్టు సౌజన్య, అవుతాపురం ఎంపీటీసీ బొమ్మెరబోయిన కల్పన, పోచంపల్లి ఎంపీటీసీ బానోత్ విజయ, గంట్లకుంట ఎంపీటీసీ ఈరెంటి అనురాధ, కొరిపల్లి ఎంపీటీసీ ఎర్ర సబిత హాజరైయ్యారు. ఎర్ర సబిత ను ఎంపీపీ గా రవీందర్ నాయక్ ప్రతిపాదించగా మిగిలిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో పెద్థవంగర ఎంపీపీ గా ఉన్న ఈదురు రాజేశ్వరి పై ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేసి, పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం తో ఏప్రిల్ 16 న వైస్ ఎంపీపీ గా ఉన్న బొమ్మెరబోయిన కల్పన ఎంపీపీ బాధ్యతలు చేపట్టి, ఇప్పటివరకు పదవి లో కొనసాగారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో పెద్దవంగర ఎంపీపీ గా ఎన్నికైన ఎర్ర సబిత తో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, ముత్తినేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్ లు ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న కు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమన్వయంతో పని చేస్తూ, మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, తహశీల్దార్ మహేందర్, ఎంపీఓ సత్యనారాయణ, ఆర్ఐ లష్కర్, ఏఎస్సై విజయ్ రావు, ఆర్డీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.