
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటే మండలిలో గళమెత్తే నాయకులు ఉండాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, తీన్మార్ మల్లన్న ను నమ్మె పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్ బాబు, పాలకుర్తి యాదగిరి రావు, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, శ్రీరాం రాము, పసులేటి వెంకట్రామయ్య, కృష్ణమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.