బాధిత కుటుంబాలకు ‘ఎర్రబెల్లి’ పరామర్శ ..

'Errabelli' for the affected families..నవతెలంగాణ – పెద్దవంగర
మండల కేంద్రానికి చెందిన చెవిగోని రాములు, కుక్కల ఐలమ్మ ఇరువురు ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు పట్టుకొమ్మలని వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ధైర్యం కల్పించారు. పార్టీ జెండా మూసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షురాలు నిమ్మల విజయ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ అనపురం రవి గౌడ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీరాం రాము, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, సతీష్ గౌడ్, ధర్మారపు యాకయ్య, యూత్ నాయకులు అనుదీప్, క్రాంతి తదితరులు ఉన్నారు.