
మండలంలోని కొరిపల్లి, చిన్నవంగర గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరామర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి బొచ్చుల సుధీర్ కుమార్ తండ్రి బొచ్చుల చంద్రయ్య, మట్టిపల్లి నందు, పాకనాటి సుధాకర్ రెడ్డి మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వారికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, ఎన్ఆర్ఐ పాకనాటి సునిల్ రెడ్డి, సోమారెడ్డి, రామకృష్ణ రెడ్డి, కొరిపల్లి సర్పంచ్ గాజుల శోభ ప్రసాద్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.