కోళ్ల ఫామ్ ను ప్రారంభించిన ఎర్రబెల్లి

Errabelli started a chicken farmనవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని మైలారం శివారులో ఏర్పాటు చేసిన కోళ్ల ఫామ్ ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపర్తి మాజీ ఎంపీటీసీ బిల్లా రాధిక సుభాష్ రెడ్డి కోళ్ల ఫామ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. కోళ్ల ఫామ్ ఏర్పాటుతో అధిక లాభాలు గడిచడమే కాకుండా స్థానికంగా ఉన్నవారికి ఉపాధిని కూడా ఇవ్వవచ్చు అన్నారు. మారుతున్న  పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.
బాధిులకు పరామర్శ
మండలంలోని మోరిపిరాల గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బుర్రి మంజుల భర్త బుర్రి రాజిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా ఎర్రబెల్లి విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తదుపరి గట్టికల్ గ్రామంలో మండల బీఆర్ఎస్ మండల పార్టీ బిసి  సెల్ అధ్యక్షుడు చెవ్వ కాశీనాధం బావగారు నర్సిహుముల సోమయ్య, మైలారం గ్రామానికి చెందిన కనుకుంట్ల నర్సయ్య, లేతాకుల కమలమ్మ, తాళ్ల యాదవరెడ్డి, సన్నూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుందూరు లక్ష్మి నర్సింహా రెడ్డి కుమారుడు కుందూరు సంతోష్, గడ్డమీది శ్రీనివాస్ తల్లి ఐలమ్మ ఇటీవల వివిధ కారణాలతో మరణించగా ప్రతి కుటుంబాన్ని కలిసి మనోధైర్యాన్ని నింపి పరామర్శించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, జిల్లా నాయకులు బిల్లా సుదీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గారె నర్సయ్య, పార్టీ నాయకులు పోగులకొండ వేణు, అష్రాఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.