మండలంలోని గుంటూరు పల్లికి చెందిన పెద్దబ్బాయి అనారోగ్యం పాలు కావడంతో గురువారం రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. తదుపరి కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు ఉపేందర్, పెర్కవేడు గ్రామానికి చెందిన బొమ్మెర కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారితోపాటు జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు గారె నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు ఎండి నాయిమ్, చిన్నాల రాజబాబు, బద్రు నాయక్, కుల్ల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి రెడ్డి, సంపత్ రావు, కొమ్ము రాజు తదితరులు ఉన్నారు.