ఎర్రన్ని సూరీడు ఏచూరి… ఎర్రజండ బిడ్డ ఏచూరి..

Erranni Suridu Yechuri... Erranjanda Baby Yechuri..నేతవైన నువ్వే నేస్తమైనా నువ్వే
రాతవైనానువ్వే కూతవైనా నువ్వే
పోరాటమైనా నువ్వే పార్లమెంటైనా నువ్వే
ఉద్యమాల బాట నువ్వే ఆశయాల వెలుగు నువ్వే
సీతారాం ఏచూరి… కమ్యూనిస్టు ఖడ్గధారి
ఎర్రన్ని సూరీడు ఏచూరి ఎర్రజండ బిడ్డ ఏచూరి ||ఎర్రన్ని||
ఎట్టబోతివయ్య ఏచూరి ఎంతపని జరిగింది ఏచూరి
||ఎర్రజండ||
నీవు లేకుంటేను ఏచూరి నిన్న నేడు దిగులు ఏచూరి
||ఎర్రజండ||
ఎంత చక్కనోడ ఏచూరి ఏడ తగ్గనోడ ఏచూరి
||ఎర్రజండ||
ఎన్నిచదివినవులే ఏచూరి ఏడైన నెగ్గేవు ఏచూరి
||ఎర్రజండ||
నవ్వుల్ల నెలరాజు ఏచూరి పువ్వంటి పరిమళం ఏచూరి
||ఎర్రజండ||
సమరాన మొనగాడు ఏచూరి సభలోన చెలరేగు ఏచూరి
||ఎర్రజండ||
గొప్ప పదవులు వదలి ఏచూరి పేదోళ్లకై నిలిచె ఏచూరి
యోధుల్ల అడుగుల్లో ఏచూరి పదునెక్క తానెంతో ఏచూరి
||ఎర్రజండ||
విద్యార్థిగా మొదలు ఏచూరి విప్లవారుణ తార ఏచూరి
||ఎర్రజండ||
విజ్ఞాన ఖని తాను ఏచూరి విశాలమగు చూపు ఏచూరి
||ఎర్రజండ||
శ్రమజీవుల కొరకు ఏచూరి సామ్యవాదం బాట ఏచూరి
ఎదురుదెబ్దేదైన ఏచూరి మునుముందుకే సాగె ఏచూరి
||ఎర్రజండ||
మత రాజకీయాల ఏచూరి మర్మాన్ని చూపాడు ఏచూరి
||ఎర్రజండ||
రాజ్యాంగ రక్షణకు ఏచూరి రణభేరి మోగించే ఏచూరి
||ఎర్రజండ||
లౌకిక భావులను ఏచూరి ఏకమే చేసెలే ఏచూరి
||ఎర్రజండ||
జగమంత తిరిగాడు ఏచూరి ప్రగతి శక్తుల కలిపే ఏచూరి
||ఎర్రజండ||
ఏమి కోరినాడు ఏచూరి ఏదైన దేశమనే ఏచూరి
||ఎర్రజండ||
కనుమూసినా తాను ఏచూరి కనుపాపగా నిలుచు ఏచూరి.
||ఎర్రజండ||
నీ తోవలో నడిచి ఏచూరి నీ కలలు పండిస్తాము ఏచూరి
||ఎర్రజండ||
తెలుగువాళ్ళ ఘనత ఏచూరి చెరిగిపోని చరిత ఏచూరి
– తెలకపల్లి రవి