బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా మండలంలోని బైక్ పేట గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిచేత నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బిజెపి, ఓబీసీ మండల అధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బిజెపి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కావాల్సి నిరంతరం కృషి చేస్తా అన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.