నవతెలంగాణ – హైదరాబాద్
తిరుపతిలో భౌగోళిక సాంకేతికతలతో ఆవిష్కరణలు, అడ్వాన్స్ లెర్నింగ్ కోసం ‘సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్’ స్థాపించేందుకు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సాఫ్ట్‌వేర్, సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఎస్రీ ఇండియా, ఐఐటీ తిరుపతి నవవిష్కర్ ఐ-హబ్ ఫౌండేషన్ (ఐఐటీటీఎన్‌ఐఎఫ్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యాధునిక సాఫ్ట్‌వేర్, వనరులు, నిపుణుల నేతృత్వంలోని యాక్సెస్‌ను అందించడం ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీలు, స్టార్టప్‌లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో భౌగోళిక ఆలోచనను ప్రోత్సహించడం, భౌగోళిక సాంకేతికతను నేర్చుకోవడం, పరిశోధన, అభివృద్ధి కోసం ఈ ‘సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్’ కేంద్రంగా పని చేస్తుంది. ఇంకా జీఐఎస్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డొమైన్‌లలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లు విద్యార్థులకు టెక్నాలజీలో తాజా ట్రెండ్‌లను అన్వేషించడంలో సహాయపడతాయి. సవాళ్లు పరిష్కారం, అన్వయించడం నేర్చుకుంటారు. తద్వారా భౌగోళిక రంగంలో ఆశాజనకమైన కెరీర్‌లకు సిద్ధంగా ఉంటారు. ఈ జ్ఞానం, నైపుణ్యం దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఐఐటీ తిరుపతిలో ఈ సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ స్థాపనకు ఎస్రీ ఇండియాతో భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సహకారం విద్యార్థులకు, స్టార్టప్‌లకు, పరిశ్రమ నిపుణులకు అత్యాధునిక భౌగోళికానికి అసమానమైన యాక్సెస్ అందిస్తుందన్నారు. సాంకేతికత, వనరులు ఆవిష్కరణలలో ముందంజలో ఉండడానికి, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు అభివృద్ధి చేయడానికి, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా పరిశ్రమ, విద్యాపర పరస్పర చర్యలను సులభతరం చేయడం ద్వారా గణనీయంగా దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా ఎస్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్’ ద్వారా ఐఐటీ తిరుపతితో మా సహకారం తదుపరి తరం జియోస్పేషియల్ నిపుణులను ప్రోత్సహించే దిశగా ఉంటుందన్నారు. జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండ్‌లో ఉందన్నారు. ఉపగ్రహాలు, డ్రోన్‌ల వంటి భూ పరిశీలన వ్యవస్థల నుంచి జియోస్పేషియల్ డేటా లభ్యత, అధునాతన స్థాన-ఆధారిత విశ్లేషణల ఉపయోగం, జీఐఎస్, ఏఐ/ఎంఎల్ ఏకీకరణ, అధిక కంప్యూటింగ్ శక్తి వృద్ధికి కొన్ని కీలకమైన డ్రైవర్లు అన్నారు. ఈ భాగస్వామ్యం అత్యాధునిక జీఐఎస్ నైపుణ్యంతో విద్యార్థులు, నిపుణులను శక్తివంతం చేస్తుందన్నారు. విభిన్న రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రతి పరిశ్రమలో డేటా విశ్లేషణ అనివార్యమైనందున, ఈ సెంటర్‌లో పొందిన జ్ఞానం, నైపుణ్యాలు అభ్యాసకులకు అనేక కెరీర్ అవకాశాలను అన్‌లాక్ చేస్తాయన్నారు.