సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్సై

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని హరిజనవాడ కాలనీలో గురువారం ఎస్సై ఆంజనేయులు సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రానికి చెందిన కౌసల్యా దేవి ఫౌండేషన్ సహకారంతో కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరు దొంగతనాలు, నేరాలు జరగకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌసల్యా దేవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ రెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.