నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల యందు ఈనెల 27న ఉదయం 11 గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి స్వామి తెలిపారు. జంతు సంరక్షణ, పౌరుల బాధ్యత పై నిర్వహించే ఈ ఈ పోటీలకు మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు ఒక్కో పాఠశాల నుండి ఇద్దరు పాల్గొనేలా అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ తెలియజేశారు.