యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు

నవతెలంగాణ – తొగుట
మారకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూని యర్ కళాశాలలో విద్యార్థినిలకు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాల గురిం చి అవగాహన కల్పించారు. వాటి నివారణ మార్గా ల పైన వ్యాసరచన, డ్రైవింగ్ పై ఉపన్యాస పోటీ లు నిర్వహించారు. గంజాయి ఇతర మత్తు పదా ర్థాలకు ఎవరు బానిస కావద్దని సూచించారు. వాటిని ఉపయోగించితే చాలా ప్రమాదమని వివ రించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీ య స్థానం సాధించిన వారికి బుధవారం సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.