వ్యాసరచన, కవితల పోటీలు ..

నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రస్తుత పరిస్థితుల్లో నేటితరం యువతి యువకుల్లో ఆదరణ కోల్పోతున్న మాతృభాష తెలుగును పరిరక్షించడానికి విద్యార్థుల్లో తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను పెంపొందించడానికి నెహ్రూ యువ కేంద్ర ఇందూరు భారతి సంయుక్త ఆధ్వర్యంలో యువతి యువకులకు తెలుగు కవితలు, వ్యాసరచన మరియు తెలుగు భాషా సంబంధించిన ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని ఎన్ వై క కోఆర్డినేటర్ శైలి బెల్లాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన వారికి నియమాలు వయస్సు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. వ్యాసము, కవితలు కేవలం తెలుగు భాషలో మాత్రమే రాయాలి.ఉపన్యాసము కేవలం తెలుగు భాషలో మాత్రమే చెప్పాలి. వ్యాసరచన పోటీ అంశము తెలుగు భాషా పరిరక్షణ కోసం నేటి యువతరం యొక్క బాధ్యత అనే అంశంపై పోటీలో పాల్గొనాలన్నారు. ఉపన్యాస పోటీ అంశము సమాజ పరివర్తనలో మాతృభాష యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై పోటీలో పాల్గొనాలన్నారు. కవితల పోటీలో అంశము తెలుగు భాష పరిరక్షణ అనే అంశంపై పాల్గొనాలని తెలిపారు.ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన వారికి 2000/-,1000/- నగదు బహుమతి అందించడం జరుగుతుంది. పోటీలు నిర్వహించు తేదీ 21 నవంబర్ 2024 గురువారం నెహ్రూ యువ కేంద్ర సుభాష్ నగర్ నిజామాబాద్ లో ఉదయం 10 గం.లకు పాల్గొనాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ పేరు,వివరాలను వాట్సాప్ 9100435410 ద్వారా నమోదు చేసుకోవాలని నెహ్రూ యోగేంద్ర జిల్లా యోజన అధికారిని శైలి బెల్లాల్ తెలియజేశారు.