అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై పుష్ప రాజ్

నవతెలంగాణ-రాజంపేట్ ( భిక్కనూర్ )
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రాజంపేట్ మండల ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అక్రమంగా ట్రాక్టర్ లో ఇసుకను లేత మామిడి తాండా నుంచి వేరే గ్రామాలకు సరఫరా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా నడిపి తండా కు చెందిన వ్యక్తిని, ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సురేష్, చరణ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.