
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించటానికి పడుతున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని హుస్నాబాద్ ఎస్ ఐ తోట మహేష్ అన్నారు. గురువారం మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని, సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉందన్నారు. విద్యార్థి దశ చాలా కీలకమని కష్టపడే తత్వంతో ఇష్టపడి చదువుకోవలన్నారు. విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, షీ టీమ్ నిర్వహిస్తున్న విధులు, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాలపై వివరించారు.అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ , మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందన్నారు ,మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ మల్లేశం, హుస్నాబాద్ షీటీమ్ బృందం సదయ్య, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కృష్ణ, శివకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.