తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు లభ్యం

తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు లభ్యం– కలెక్టర్‌ రాజర్షి షా
– ఎస్‌పీసీ క్యాంటీన్‌ ప్రారంభించిన కలెక్టర్‌,ఎస్పీ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
జిల్లా పోలీసు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన సబ్సిడరీ పోలీస్‌ క్యాంటీన్‌ (ఎస్‌పీసీ) ద్వారా తక్కువ ధరలకే నిత్యావసర సరకులు దొరుకుతాయని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. బుధవారం ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గల చక్రపాణి మెమోరియల్‌ హాల్‌ వద్ద ఎస్పీ గౌష్‌ ఆలం, రెండవ బెటాలియన్‌ కమాండెడ్‌ నితికా పంత్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లోని నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వస్తువులు తక్కువ ధరలకే లభిస్తాయని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం దిన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 1500 కుటుంబాలు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఈ క్యాంటీన్‌ ఉపయోగపడుతుందని తెలిపారు.