నవతెలంగాణ – శంకరపట్నం
మతిస్థిమితం కోల్పోయి గత రెండు రోజుల నుండి శంకరపట్నం మండల కేంద్రంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి అతని ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం మతిస్థిమితం లేని వ్యక్తి గ్రామం పాలంపేట, మండలం రామప్ప. జిల్లా ములుగు అనీ తెలుసుకొని శనివారం అతని తల్లిదండ్రులైన మొగిలి కి ఫోన్ చేసి తన కొడుకు మా దగ్గరే ఉన్నాడని పిలిపించి తన కుమారుడైన గట్టు రాజేష్ ని తల్లిదండ్రులకు అప్పగించారు. తన కొడుకుని అప్పగించినందుకు ఎస్సైకి తల్లి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.