హైదరాబాద్: ఇండిస్టీయల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అవెవా హైదరాబాద్‌లో తన అత్యాధునిక కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. నగరంలోని అవెవా వారి అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ ఆర్‌అండ్‌డి ల్యాబ్ అని.. ఇందులో 1200 మందికి పైగా టెక్నాలజిస్టులు పనిచేస్తారని సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా అవెవా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సూ క్వెన్స్ తెలిపారు. హైదరాబాద్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ తమ అధునాతన పారిశ్రామిక పరిశోధన, అభివద్ధిని ప్రదర్శిస్తుందన్నారు. సెంట్రలైజ్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ సామర్థ్యాలు, ఆర్ అండ్ డీ ఇంజినీరింగ్ సర్వీసెస్, క్లౌడ్ డెవ్ ఆప్స్, టెక్నికల్ సపోర్ట్ వంటి సేవలను అందిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమకు ఇలాంటివి ఆరు సెంటర్లు మాత్రమే ఉన్నాయన్నారు.