నవతెలంగాణ – ఆర్మూర్
రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యముల పట్టణములోని మామిడిపల్లి చౌరస్తా సమీపములో గల ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రం కేంద్రాన్నీ గురువారం రక్ష స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఖాందేష్ మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే సదుద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సంస్థ సభ్యులము అందరం కలిసి ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమములో రక్ష సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి, కార్యనిర్వాహక కార్యదర్సులు బేతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేష్ సత్యం, సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్ మక్కల సాయినాథ్, షాహీద్, నరేందర్, సురేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.