సీఎం కెసీఆర్‌ ముందుచూపుతోనె చెక్‌డ్యాంల ఏర్పాటు..

– ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌
నవతెలంగాణ-కోహెడ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతోనె రైతుల సంక్షేమం కోసం చెక్‌డ్యాంల ఏర్పాటు చేశారని ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బస్వాపూర్‌, ఆరెపల్లి గ్రామాలలో మోయతుమ్మెదవాగును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చెక్‌ డ్యామ్‌ వద్ద గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చెక్‌డ్యాంల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయని ముందుచూపుతో చెక్‌ డ్యాములు నిర్మించడం జరిగిందని, వర్షాలు లేని సమయంలో కూడా చెక్‌ డ్యాముల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి సర్పంచ్‌ లాపుడ్య సరోజన దెవేందర్‌, బస్వాపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఎడబోయిన సత్తయ్య, మాజీ ఎంపీటీసీ కొక్కుల రమేష్‌, మాజీ సర్పంచ్‌ చింతల బాలనర్సూ, నాయకులు శ్రీనివాస్‌, ఎండీ ఇక్భాల్‌, ద్యావర శ్రీనివాస్‌, బండి సంపత్‌, తాటిపాముల సుధీర్‌, మాంకాల రమేష్‌, ఎడబోయిన కనకయ్య, బందెల భూపతి, తాటిపాముల రాయరాం, జనార్ధన్‌, రాజు, రవీందర్‌, రాకేష్‌, రాజు, తదితరులు పాల్గోన్నారు.