తెలంగాణ యూనివర్సిటీలో నూతన పీజీ అడ్మిషన్స్ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడ్మిషన్స్ కోసం గ్రామీణ ప్రాంతాల నుండి యూనివర్సిటీ కి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్మిషన్స్ పూర్తయ్యేంతవరకు పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం సహాయ సహకారాలు అందిస్తుందని, యూనివర్సిటీ అధికారులు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే మా దృష్టికి తీసుకు రాగలరని, ఎటువంటి సహాయం కావాలన్నా మాకు సంప్రదించగలరనీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, రవీందర్, బిందు,రాకేశ్, మణికంఠ, రాకేశ్, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.