సామ్‌సంగ్‌ ‘సీడ్‌’ ల్యాబ్‌ ఏర్పాటు

బెంగళూరు : సామ్‌సంగ్‌ ఆర్‌అండ్‌డి ఇన్స్‌ట్యూట్‌ ఇండియా బెంగళూరులోని గార్డెన్‌ సిటీ యూనివర్శిటీ (జిసియు)తో కలిసి సామ్‌సంగ్‌ స్టూడెంట్‌ ఎకోసిస్టమ్‌ ఫర్‌ ఇంజినీర్డ్‌ డేటా (సీడ్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. విద్యార్థులు, అధ్యాపకులకు ఎఐ, ఎంఎల్‌, డేటా ఇంజనీరింగ్‌ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఇది అద్బుతమైన నైపుణ్యాలను నేర్పిస్తుందని పేర్కొంది. తమ సంస్థ ఇప్పటికే దేశంలో నాలుగు సీడ్‌ ల్యాబ్‌లతో పలు ప్రాజెక్టుల్లో 400 పైగా విద్యార్థులకు అభ్యాసనాలు అందిస్తుందని తెలిపింది.