హైదరాబాద్‌లో సీడ్‌ హెల్త్‌ ల్యాబ్‌ ఏర్పాటు

హైదరాబాద్‌లో సీడ్‌ హెల్త్‌ ల్యాబ్‌ ఏర్పాటు– సిన్జెంటా వెజిటబుల్‌ సీడ్స్‌ వెల్లడి
హైదరాబాద్‌ : భారత్‌లో అత్యాధునిక సీడ్‌ హెల్త్‌ ల్యాబ్‌ను హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రారంభించినట్లు సిన్జెంటా వెజిటబుల్‌ సీడ్స్‌ వెల్లడించింది. మేడ్చల్‌ మండలం నూతంకల్‌లో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గురువారం దీన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఎం రఘునందన్‌ రావు లాంచనంగా ప్రారంభించారు. కీలకమైన ప్రపంచ విత్తన ఎగుమతిదారుగా నిలువాలనే భారత లక్ష్యానికి అనుగునంగా ఈ పెట్టుబడి మద్దతు ఇస్తుందని సిన్జెంటా వెజిటబుల్‌ సీడ్స్‌ గ్లోబల్‌ హెడ్‌ ఎరిక్‌ పోస్ట్మా పేర్కొన్నారు. సాగుదారులకు అత్యధిక నాణ్యత గల కూరగాయల విత్తన ఉత్పత్తులను అందించాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ సంస్థ 124 దేశాలకు విత్తనాలను సరఫరా చేస్తుందన్నారు.