– ఆళ్ళపల్లి ఎంపీడీవో మార్తి రామారావు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఉత్తర్వుల మేరకు ఆళ్ళపల్లి మండలలో 12 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కొనసాగుతారని స్థానిక ఎంపీడీవో మార్తి రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 31న సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మండలంలోని బోడాయికుంట, రామానుజగూడెం గ్రామాలకు తహసీల్దార్ లంకపల్లి వీరభద్రం, పాతూరు, రాయిపాడు గ్రామాలకు డిప్యూటీ తహశీల్దార్ సీ.హెచ్ అనుష, పెద్ద వెంకటాపురం గ్రామానికి వ్యవసాయ శాఖ అధికారి జి.వెంకట రామారావు, అడవిరామవరం, మర్కోడు, నడిమిగూడెం, రాఘవాపురం గ్రామాలకు ఎంపీఓ బత్తిన శ్రీనివాసరావు, ఆళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు దొంగతోగు, అనంతోగు గ్రామాలకు ఎంపీడీవో మార్తి రామారావు గురువారం నుంచి ప్రత్యేక అధికారులుగా విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు.