హైదరాబాద్ : యూటీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ నిజామాబాద్‌లో తమ కొత్త ఫైనాన్సీయల్ సెంటర్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. నవంబర్ 18న తూర్పు, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో మరో 19 కొత్త సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. చిన్న పట్టణాలు, నగరాల్లోనూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సెంటర్లు దోహదం చేయనున్నాయని యూటీఐఎంఎఫ్ ఎండీ, సీఈఓ ఇంతయాజుర్ రెహ్మాన్ పేర్కొన్నారు.