– మరో ఎనిమిది తెరుస్తాం
– ఆ సంస్థ హెడ్ అనూజ్ ధీర్ వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ లైటింగ్ ఉత్పత్తుల కంపెనీ విప్రో కన్సూమర్ కేర్ అండ్ లైటింగ్ తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వినూత్న లైటింగ్ ఉత్పత్తులు సహా సిట్టింగ్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ నూతన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను మంగళవారం ఆ కంపెనీ కమర్షియల్ అండ్ ఇన్స్‌ట్యూషనల్ బిజినెస్ హెడ్ అనూజ్ ధీర్ లాంచనంగా ప్రారంభిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో 6-8 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను తెరువనున్నా మని చెప్పారు. ఈ రంగం మార్కెట్ విలువ రూ.9,000 కోట్లుగా ఉంటుంద ని.. ఇందులో తమ సంస్థ11 శాతం వాటాతో రూ.1,000 కోట్ల రెవెన్యూ కలిగి ఉందన్నారు. తమ వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 12-15 శాతం వరకు ఉంటుందన్నారు. ఇక్కడి దాదాపు ప్రతీ ఫార్మా కంపెనీ తమ లైటింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తోందన్నారు. ఆరేళ్ల క్రితం అవుట్‌డోర్ లైటింగ్ సెగ్మెం ట్‌లోకి వచ్చామని.. తమ అమ్మకాల్లో 15 శాతం వరకు ఈ విభాగం వాటా కలిగి ఉందని.. దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు.