నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేస్తానని, రాష్ట్రంలో పది పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం స్థానిక గజ్వేల్ పీఎన్‌ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక నిధులు మంజూరు చేసిందన్నారు. మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విజయ సంకల్ప యాత్రలను చేట్టినట్లు తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి దష్టికి తీసుకుపోనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు తిరిగి భూమి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని ఆయన గుర్తు చేశారు. భూములు నోట్ రెడీ చేసిన భూములు తీసుకుంటే కొనుగోలు చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు, కాలువలు, రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములకు నిర్వాసితులకు రావాల్సిన పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ వచ్చేలా కషి చేస్తానన్నారు. అప్పటి ప్రభుత్వం పేదల ఉసురు తగిలి పోయిందని ఆయన అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఇప్పటి వరకు అమలైందని, దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.