మొదలైన బతుకమ్మ పండుగ వేడుకలు

నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండల కేంద్రం తోపాటు పలు గ్రామాల్లో బతుకనిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం వేళ్లల్లో వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. చేరువు లో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు.