పీజేసీ ప్రాఫిట్‌ చైర్మెన్‌గా ఈటెల బాధ్యతల స్వీకరణ

– కమిటీ ఉద్యోగులతో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ(పీజేసీ) ఆన్‌ ఆఫీసెస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ చైర్మెన్‌గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సోమవారం నాడిక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిటీ ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మల్కాజిగిరికి సంబంధించిన పలువురు నేతలు ఈటెలను కలిసి అభినందనలు తెలిపారు. అంతకు ముందు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈటెల రాజేందర్‌ ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఈ భేటీలో భాగంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో కరోనా టైం లో మున్సిపల్‌ కార్మికులు మతి చెందారని వివరించారు. కరోనా మహమ్మారితో మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని రిక్వెస్ట్‌ చేశారు. కాగా, తమ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని ఈటెల కార్యాలయం మీడియాకు వెల్లడించింది.