ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలి

– గుగ్గీల్ల గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద గ్రామస్తుల రీలే నిరవధిక దర్నా
నవతెలంగాణ-బెజ్జంకి: గుగ్గీల్ల గ్రామ శివారులో తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద పాలకవర్గం సభ్యులతో కలిసి గ్రామస్తులు నిరవధిక రీలే దర్నా చేపట్టారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 557, 559, 561 యందు ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరీ చేసిన అనుమతులను రద్దు చేసేంతవరకు నిరవధిక రీలే దర్నాలు కోనసాగిస్తామని గ్రామస్తులు ప్రభుత్వాధికారులను హెచ్చరించారు. సర్పంచ్ సీత లక్ష్మి, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.