భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి రవాణా సౌకర్యానికి ఆటంకం కలుగుతుందని భావించి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వైద్యాధికారి అల్లం అప్పయ్య జిల్లావ్యాప్తంగా 23 మంది గర్భిణీలను ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అందులో భాగంగా మండలంలోని ఊరట్టం గ్గురామానికి చెందిన గుత్తి కోయ గర్భిణీ స్త్రీ “మున్నీ” ని ఏటూర్ నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 6:40 నిమిషాలకు గర్భిణీ మున్ని ప్రసవించింది. డి ఎం ఎం హెచ్ ఓ అల్లం అప్పయ్య బాలింత మునిని, పాపను పరీక్షించి మందులు అందించారు. తల్ల పిల్ల క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని వివిధ రకాల పేషెంట్లను పరీక్షించి మందులు అందించారు.