
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తరలింపును నిలిపివేయాలని భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి జగన్ మోహన్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంగ ప్రవీణ్ మాట్లాడుతూ అర్బన్ ప్రాంతంలో కొనసాగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని అందులో పని చేస్తున్న కొంతమంది సిబ్బంది యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వ సిఫారసు మేరకు తరలింపును చేపట్టడం అసమంజసమని అన్ని విధాల విద్యార్థులకు సిబ్బందికి సౌకర్యంగా ఉండే జిల్లా కేంద్రంలోని ఈ యొక్క పాఠశాలను నిర్వహించాలని అన్నారు అధికారులు కలెక్టర్ సంబంధిత డీఈఓ వెంటనే స్పందించి తరలింపును నిలుపుదల చేయాలని కోరారు.