తెలంగాణ రైతులకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి

– ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి
– టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై నిరసన, దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కొడంగల్‌
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ వద్దని, వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే రైతులపై రేవంత్‌ రెడ్డి విషయం నింపుకొని ఉన్నారని అర్థమవుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపులో భాగంగా గురువారం కొడంగల్‌ లోని అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన రేవంత్‌ రెడ్డిదని అనానరు. కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి రైతులపై ప్రేమ ఏ విధంగా ఉందో రైతు వ్యతిరేక విధానాలను ఎన్నికల ముందే బయట పెట్టడం సంతోషమన్నారు, రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్‌ పార్టీ నాయకులని విమర్శించారు.కేసీిఆర్‌ పాలనలో రైతులకు అందుతున్న 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, అనేక సంక్షేమ అభివద్ధి పలాలను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అందకుండా చేయాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదనీ, వచ్చినా సీనియర్‌ నాయకులు రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాశనం చేసేందుకే మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందని అన్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ ినుంచి పోటీ చేస్తారో చెప్పాలన్నారు. రైతులు సాప్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసే వారికన్నా ఎక్కువగా సంపాదించడం తోనే కాంగ్రెస్‌ నాయకులకు రైతులపై ఈర్ష్య ఏర్పడిం దనిన్నారు. రైతులు గతంలో కరెంటు లేక రోడ్లపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారని కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం రైతుల నుంచి మద్దతు లేక పోవడంతో రేవంత్‌ రెడ్డికి రైతులపై ద్వేషం ఏర్ప డింద న్నారు. తొమ్మిదేండ్లలో బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు ఏరోజు కూడా రోడ్డు ఎక్కిన సందర్భం రాలే దన్నారు. గతంలో కరెంటు లేక, ధాన్యం కొనుగోలు చేయక కాంగ్రెస్‌ పార్టీ రైతులను ఇబ్బందులు పెట్టినందుకు ఓటు వేయాలి అని కాంగ్రెస్‌ నాయకులు నిలదీశారు. కాంగ్రెస్‌ నాయకులను, రేవంత్‌ రెడ్డి గ్రామాల్లోకి వస్తే రైతులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కొడంగల్‌ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో మరోసారి నరేందర్‌ రెడ్డిని గెలిపించు కోవాలని తహతహ లాడుతున్నారని తెలిపారు. తెలం గాణ రైతులకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు, ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ బొంరస్పెట్‌ మండల అధ్యక్షులు కోట్ల యాదగిరి, కొడంగల్‌ మండల అధ్య క్షులు దామోదర్‌రెడ్డి, ఎంపీపీ పటేల్‌ విజరు కుమార్‌, జెడ్పిటిసి కోట్ల మహిపాల్‌, కౌన్సిలర్‌ మధు సూదన్‌ యాదవ్‌, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, బైరెడ్డి నరోత్తం రెడ్డి, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బీములు, విష్ణువర్ధన్‌ రెడ్డి, సర్పం చులు సయ్యద్‌ అంజద్‌, పకీరప్ప, బిఆర్‌ఎస్‌ నాయ కులు మడిగే శ్రీనివాస్‌, నరేష్‌, జావిద్‌, అరుణ్‌, మాజీ సర్పంచ్‌ రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.