తట్టు తాకితేగాని విషయం తెల్వదంట ఎవరికైనా. సరిగ్గా గిప్పుడు బీఆర్‌ఎస్ నేతల పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవబట్టే. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ధర్నాలు చేసుకోండ్రి, ఇక్కడెందుకు అన్నోళ్లు గిప్పుడు కవితను అరెస్ట్ చెయ్యంగనే అప్పుడే రాష్ట్రమంతా బంద్ పెట్టుర్రి, ధర్నాలు చేయుండ్రీ, నిరసన చెప్పుర్రి చెవిలో జోర్రీగల మొత్తుకోబట్టే. అందుకు మన మంత్రి ఎంకన్న ఊకుంటడా ఎంటనే అందుకున్నడు..కవితను అరెస్ట్ చేసింది ఈడీ, ఢిల్లీలో పోయి అక్కడ కూకోర్రీ గీడెందుకు? జనాలకు ఇబ్బందులు పెట్టకుర్రీ అంటూ దీర్ఘాలు తీసే. ఈడీ అధికారులతో ఇంగ్లీషుల మాట్లాడిన యువనేతకు ఇప్పుడేం ఏంసేయాలో పాలు పోవట్లేదను కుంటా? ఏకంగా ధర్నాచౌక్‌కే ఎసరుపెట్టి ఇప్పుడు ధర్నాలు చేయుర్రీ, జెండాలు పాతండి అనడం కాకకు తోక కత్తిరించినంకగానీ అర్థంకాలేదు పాపం! మంచిది ఇక ఉంట మరీ. నాకెందుకీ తంట.
– బి.బసవవున్నయ్య