రేవంత్‌ పవరేంటో చూసాక కూడా ఛాలెంజా?

– మాజీ మంత్రి కేటీఆర్‌కు మల్లు రవి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవరేంటో చూశాక కూడా ఛాలెంజ్‌ ఎలా విసురుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి ఛాలెంజ్‌లు మానుకోవాలని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ముందు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటైనా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధిరాలేదని విమర్శించారు.