భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న, ప్రజల జీవితాలు ఇంకా చెత్త కుప్ప లోనే మునిగి తేలుతున్నాయి. బ్రతకాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే చెత్త కుప్పలో డబ్బులు, వ్యర్థ ఏరుకొని, విక్రయించి కుటుంబాన్ని పోషించడం తప్పడం లేదు. రెడ్డి పేట, మద్దికుంట గ్రామ పరిసరాల్లో వ్యర్థంగా ఉన్న కాలి ప్లాస్టిక్ బాట లను సేకరించి రెడ్డిపేట్- రామారెడ్డి రోడ్డు పై మూటను నెత్తిపైన ఎత్తుకొని దాదాపు పది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ విక్రయ కేంద్రం వద్ద రూ 5 కు కిలో చొప్పు విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు. దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని చెప్పుకుంటున్న, క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజల అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది.