– కేంద్రం పట్టించుకోవడం లేదు.. మరి రాష్ట్రం ఏం చేస్తుంది
– ప్రత్యేక నిధి కేటాయించాలని డిమాండ్
– గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మంది తెలంగాణ కార్మికులు
నవతెలంగాణ – సిరిసిల్ల
40 ఏళ్ల కిందట ఉపాధి తోవ పట్టిన కార్మికులు… ఉద్యోగులు దేశం కానీ దేశాల్లో ఇబ్బందులు పడుతూ తమను ఆదుకునే ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని వేల మైళ్ళ దూరం వెళ్లిన అభాగ్యులు అక్కడ చేయూత కరువై… చేద్దామంటే పని కరవై కొన్నిసార్లు ఉట్టి చేతులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇంటిల్లిపాదికి ఆసరాగా ఉంటారనుకున్న వాళ్ళు ఎందరో ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తుంటే వారికి చేసిన అప్పులు చెల్లించాలంటూ వేధింపులు.. ఇంటి భారము మోయలేని పరిస్థితులు.. ఇలా వెక్కిరింపులే ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తప్ప ఎవరూ ఆదుకోలేరు. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రవాసుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారి సంక్షేమం కోసం కేటాయింపులు ఏమి చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానంగా ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూర్ కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల నుంచి నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, ఓమన్, కతర్, కువైట్, బెహరాన్ ఇరాక్ ఇజ్రాయిల్ సింగపూర్ మలేషియా తదితర గల్ఫ్ దేశాలకు సుమారు 10 లక్షల మంది తెలంగాణ ప్రజలు వెళ్లారు. ఆయా దేశాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు కూడా వేల సంఖ్యలో ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్లారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో రాష్ట్రంలోని జిల్లాలకు చెందినవారు.
గతంలో కార్మికులుగా వెళ్లిన ఇటీవల ఉద్యోగాల కోసం కూడా వెళ్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు పలు సందర్భాల్లో అష్ట కష్టాలు పడుతున్న అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు గత రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్కడికి వెళ్లిన వారితోపాటు ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కూడా గల్ఫ్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు గల్ఫ్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. 2014 మేనిఫెస్టోలో గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల నిధులు వెచ్చిస్తామని చెప్పింది. అంతేకాకుండా చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది ఇట్లా మోసానికి కఠిన చట్టాలు తీసుకువస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో 9 మాసాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు గల్ఫ్ కార్మికులే ఎన్నికల్లో పోటీ చేశారు రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు గత ఏడాది 1200 మంది మృత్యువాత పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా మృతి చెందినప్పుడు కానీ అక్కడ ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ సంక్షేమ నిధి నుంచి వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
డిమాండ్లు ఇవి..
– గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
– బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి కేరళ లో విధానం చాలా బాగుంది కేరళ ప్రవాశీల కోసం ప్రత్యేక నిధి కేటాయించారు దీంతో కేరళ వారికి అవసరమైన సమయాల్లో చేయూత లభిస్తుంది అంతేకాకుండా కేరళ రాష్ట్రం నుంచి ఎంబసీలో ఐదు నుంచి పదిమంది కేరళ అధికారులు ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రం కు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఉండగా స్వచ్ఛంద సేవలు చేసే వారిని ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అక్కడ కోఆర్డినేటర్లుగా నియమించింది ఎన్నారై పాలసీ ద్వారా చనిపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబానికి పది లక్షల బీమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది ఎన్నారై కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ప్రత్యేక ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసింది దీంతో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవచ్చు ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుంటుంది గల్ఫ్ దేశాల్లో ఆదరణ ఉన్న ఉద్యోగాలకు ఉచిత సాంకేతిక శిక్షణ అవగాహన కల్పించాలి మృతదేహాలను స్వదేశానికి తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
– తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన వారితో పాటు వివిధ దేశాల్లో జైల్లో మగ్గుతున్న వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి భారత రాయబార కార్యాలయం ద్వారా సమస్యలు పరిష్కరించాలి అనుకొని సంఘటనల్లో గాయపడిన అచేతన స్థితిలోకి వెళ్లిన వారికి ప్రభుత్వమే వైద్య చికిత్స అందించాలి