– ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కలెక్టరేట్ ముట్టడి
– అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వాలు మారిన విద్యార్థుల తలరాతలు మాత్రం మారడం లేదని వారి బాదాలు తీరడం లేదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయిత గొని జనార్దన్ గౌడ్ ఆవేదన చందారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విద్యార్థులను గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ను ముట్టడించారు. విద్యార్థి సంఘ నాయకులు కలెక్టరేట్లోకి చోచ్చుకు పోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కళాశాల ద్యార్థులకు సంవత్సరనికి 20 వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్ధికి మంజూరు చేయాలని, ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రూ.1800 నుండి రూ.15 వేలకు పెంచాలని, కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500 నుండి 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100 నుంచి 2 వేలకు పెంచాలని, బిసిలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బిసి గురుకుల పాటశాలలు, 50 డిగ్రీ కాలేజిలు మంజూరు చేయాలని పోరాడుతున్నామని,పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తాని అన్నారు. విదేశీ విద్యార్థులందరికి 20 లక్షల పై ఫండు ను మంజూరు చేయాలని, బిసి. కాలేజి హాస్టళ్లకు, గురుకుల పాటశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలగోని వెంకటేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, జక్క నాగేశ్వరరావు విద్యార్థి సంఘం నాయకులు పొగాకు రవికుమార్, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, చింతల విజయకుమార్, బచ్చనబోయిన రాజు యాదవ్, తరుణ్ కుమార్ యాదవ్, మహేష్, మణికంఠ, స్వామి, శ్రీకాంత్, మహేందర్, అని కుమార్, ఫణి కుమార్ గణేష్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.