నవతెలంగాణ-నార్సింగి
జాతీయ రహదారి 44 పై ఉన్న నార్సింగి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తమ శాఖ వద్ద ఏటిఎంను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో, అవసరమైనప్పుడు, బ్యాంక్‌కు సెలువు ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవడానికి వీలు కలుగుతుందని ప్రజలు సంతోష పడ్డారు. జాతీయ రహదారిపై నుంచి ప్రయాణం చేస్తున్నవారికి సైతం ఉపయోగ పడుతుందని అనుకున్నారు. కానీ, ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. బ్యాంకు సమయాల్లో మాత్రమే ఏటిఎంను తెరుస్తూ, మిగతా సమయాల్లో తాళం వేసి ఉంచుతూ ఏటిఎం ఉండి కూడా ప్రయోజనం లేకుండా చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో, సెలవు దినాల్లో డబ్బులు అవసరమైనప్పుడు ఇబ్బందులు తప్పడం లేవు. డబ్బులు తీసుకోవాలంటే 10 కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. అటు చేగుంట గాని లేదా ఇటు రామాయంపేటగాని వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కాలంలో ఎక్కువ శాతం ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నా అందరికీ అన్నీ వేళలో సాధ్య పడదు. ఏటిఎం ఉన్నా లాభం లేదని, సంభందిత అధికారులు ఇకనైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.