బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనూ అభివృద్ధి శంకుస్థాపనలతో శిలాఫలకాలే దర్శనం

– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎన్నికల హడావుడితో శంకుస్థాపన
– శిలాఫలకం ఏర్పాటు చేసి ఐదు నెలలు కావస్తున్నా,  ఆ నిధులు ఎక్కడ? లింబూరు గ్రామస్తులు ఆవేదన
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలోగల లింబూరు వాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు గ్రామానికి వెళ్లే మధ్యలో వాగు ఉంది. వాడీ గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి దాదాపు దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కరువు వర్షాకాలం వచ్చింది అంటే హరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గ్రామానికి చేరుకోవాల్సిందే. ఎందుకంటే వర్షాకాలం నాలుగు మాసాలు సరైన రోడ్డు సౌకర్యం లేక నడవడానికి పరిస్థితి మధ్యలో వాగు పొంగిపొర్లుతుంటే ఊరికి వెళ్లలేని దుస్థితి. ఇలాంటి దుస్థితి గ్రామానికి 75 ఏళ్ల కాలంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. ఇటీవల టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంగా అధికారాన్ని చేపట్టింది. 10 సంవత్సరాలు గడిచిన వాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయింది. 2023 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వాడి గ్రామానికి రోడ్డు వాగు పైన వంచన నిర్మాణానికి మూడు కోట్ల నిధులు మంజూరైనట్లు గత ఎమ్మెల్యే హనుమంతు షిండే 2023 సెప్టెంబర్ 24న లింబూర్ గ్రామంలో షీలా ఫలకం ఏర్పాటు చేసి, లింబూర్ నుండి వాడి గ్రామానికి బీటీ రోడ్డు మధ్యలో వాగు పైన వంచన నిర్మించడానికి మూడు కోట్లు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని శంకుస్థాపన చేయడం, షీలాఫలకం వేసి ఐదు నెలలు కావస్తుంది, గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హడావుడితోనే ఎన్నికల ముందు మూడు కోట్లు మంజూరైనట్లు శిలాఫలకం ఏసి శంకుస్థాపన చేయడం, నిధులు మంజూరు అయినట్లేనా, కానట్లేనా, గత ప్రభుత్వ ఎమ్మెల్యే హనుమంతు షిండే నిధులు లేకపోయినా శిలాఫలకాలు ఏర్పాటు చేసి శంకుస్థాపనలు చేపట్టి ప్రజలకు ఎన్నికల ముందర మభ్య పెట్టడానికేనని, లింబూర్ గ్రామ ప్రజల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీలాఫలకం దగ్గర నిలబడి నిధులు లేని శిలాఫలకం దర్శనమిస్తుందని, ఇలాంటి శిలాఫలకాలు మండలంలో కోట్లాది రూపాయలతో శంకుస్థాపనలు చేసి, మళ్లీ గెలవాలని ఉద్దేశంతో గత ఎమ్మెల్యే హనుమంతు షిండే షీలాఫలకాలపై కోట్లాది రూపాయల నిధులు మంజూరైనట్లు ఏర్పాటు చేయడం, ఆ నిధులు ఏమయ్యాయి అంటూ లింబూర్ గ్రామ ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వాడి గ్రామ ప్రజలకు గత ప్రభుత్వం తూతూ మంత్రంగానే నిధులు మంజూరైనట్లు షీలాఫలకాలతో శంకుస్థాపన చేయడం ఆ గ్రామ ప్రజల కల నెరవేరేది ఎప్పుడో నని, గత ప్రభుత్వం ఎన్నికల హడావుడి మళ్లీ గెలవాలని ఆలోచనతో నిధులు మంజూరు అయినట్లు మోసం చేశారా, లేక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాడి గ్రామ ప్రజల ఏళ్ల తరబడి ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయించి మా కోరిక తీర్చాలని ఆ గ్రామ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.