ఎగ్ మసాలా అనేది భారతీయ వంటకాల్లో ప్రసిద్ధమైన వంటకం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, పోషక విలువలతో కూడిన ఆహారం. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన ఎగ్ మసాలా శరీరానికి అవసరమైన ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు అందజేస్తుంది.
ఎగ్ మసాలా పోషక విలువలు
ఇంట్లో ఎగ్ మసాలా తయారు చేస్తే, శుభ్రత, శుద్ధమైన పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఉండే పోషక విలువలు ఇవే:
– రెండు మీడియం సైజు గుడ్లు (పోర్షన్- 100gms)
– ప్రోటీన్ – 12-15 గ్రాములు (ఎగ్ నుంచి)
– కార్బోహైడ్రేట్స్ – 5-8 గ్రాములు (ఉల్లిపాయ, టమాటా, మసాలాలు)
– కొవ్వు – 10-15 గ్రాములు (నూనె, గుడ్లు నుంచి)
– ఫైబర్ – 2-4 గ్రాములు (కూరగాయలు, కొత్తిమీర)
– విటమిన్లు- విటమిన్ A, B12, D,E
– ఖనిజాలు – కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్, కొవ్వు, క్యాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాల్ని అందించడంలో సహాయపడతాయి.
ఎలా తయారు చేయాలి?
– నాణ్యమైన గుడ్లు, తాజా కూరగాయలు, మసాలా దినుసులు ఉపయోగించాలి
– తక్కువ నూనె, అధిక ఉప్పు, కత్రిమ రుచుల నుంచి దూరంగా ఉండాలి
– శుభ్రంగా వండేలా చూడాలి
కలుషిత ప్రమాదాలు
హోటల్స్ లేదా రోడ్డు పక్కన ఉండే స్టాళ్లలో తయారైన ఎగ్ మసాలా రుచి పరంగా బాగుండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కలుషిత పదార్థాలు కలిసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
హానికర పదార్థాలు :
– హైడ్రోజనేటెడ్ ఆయిల్ (డాల్డా) – అధిక కొలెస్ట్రాల్ సమస్యలు
– అధిక కొవ్వుతో లివర్ సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం
– రంగు పదార్థాలు – కేన్సర్, యాసిడిటి, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, యాసిడిటి
– సోడియం బెంజోయేట్ వంటి కత్రిమ పరిరక్షకాలు – దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు
– అధిక ఉప్పు, మసాలా పొడి – రక్తపోటు పెరిగే అవకాశం
– ప్రశాంత వాతావరణం లేని వంటగదిలో శుభ్రత లేకపోవడం – ఫుడ్ పాయిజనింగ్, సమస్యలు
తక్కువ పోషక విలువలకు కారణాలు :
– నాణ్యత లేని పదార్థాల వినియోగం
– శుద్ధి చేయని నూనె
– నాసిరకం గుడ్లు (పాత గుడ్లు లేదా సరైన భద్రత లేకుండా నిల్వ చేసినవి)
– అధిక నూనె, ఫ్యాట్
– హౌటళ్లలో ఎక్కువగా డీప్ ఫ్రై వంట పద్ధతిని వాడటం
– మసాలాలో అధిక నూనె కలపడం
– కత్రిమ రసాయనాల ఉపయోగం
– అధిక ఉప్పు, వీూ+ (మోనోసోడియం గ్లూటమేట్)
– ప్రిజర్వేటివ్‌లు, కలర్ పదార్థాలు
– శుభ్రతా లోపం
– శుభ్రమైన నీరు, పదార్థాలు ఉపయోగించకపోవడం
సరైన సమయంలో సరైన ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, వచ్చేవారం మళ్ళీ కలుద్దాం
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314