ఎవరెస్ట్‌, ఎండిహెచ్‌ మసాలలపై నిషేధం

ఎవరెస్ట్‌, ఎండిహెచ్‌ మసాలలపై నిషేధం– హాంకాగ్‌ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్‌ ఫుడ్స్‌, ఎండిహెచ్‌లకు హాంకాంగ్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్‌ మసాల దినుసుల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని సింగపూర్‌ ప్రభుత్వం గత వారం తెలిపింది. తాజాగా హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేప్టీ (సిఎస్‌ఎఫ్‌)అథారిటీ విభాగం ఏప్రిల్‌ 5న నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఎండిహెచ్‌ గ్రూప్‌ తయారు చేసిన మద్రాస్‌ కర్రీ ఫౌడర్‌, సాంబార్‌ మసాల్‌ ఫౌడర్‌, కర్రీ ఫౌడర్‌లలో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ గుర్తించామని అధికారికంగా ప్రకటించింది. దీంతో మసాల దినుసుల్ని అమ్మకాల్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. ఎవరెస్ట్‌ గ్రూప్‌ తయారు చేసిన కూరల మసాలల్లో పురుగుమందుల్ని గుర్తించినట్లు తెలిపింది. ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా వాడొద్దని అక్కడి ప్రజలకు సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ సూచించింది.