ప్రతి దరఖాస్తుదారునికి ఇల్లు మంజూరు చేయాలి

నవతెలంగాణ-కొత్తగూడ: గృహలక్ష్మి పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు బూర్క  వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఏఐకేఎంఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ లక్ష్మీ పథకం ప్రకటించి మూడు రోజులు గడువు ఇవ్వడం వల్ల అటు వ్యవసాయ పనులు చేసుకోలేక, ఇటు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని గృహలక్ష్మి దరఖాస్తుకు మరో 10 రోజులు గడువు పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. అంతరాయం లేకుండా నిరంతరం కరెంటును సరఫరా చేయాలని, ఏజెన్సీలో  నకిలీ పురుగుమందులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బూర్క బుచ్చి రాములు,  మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగంధర్, నాయకులు సిద్ధ బోయిన జీవన్, పసునూరి రాజమల్లు, ఈసం సారయ్య, జామ్లా, సరోజన తదితరులు పాల్గొన్నారు.