ప్రజావాణి లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలి..

– మండలాలో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి..
– వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేచించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి. ఎస్ లత తో కలిసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజా దర్బార్ దరఖాస్తు లు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజాపాలనకి సంబందించిన గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలకి సంబందించిన దరఖాస్తు లలో మార్పులు చేర్పులు పై వెంటనే పూర్తి చేయాలని జడ్పీ సి ఈ ఓ కి సూచించారు. అలాగే మండలాలో ప్రత్యేక అదికారులు నిరంతరం హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, పి హెచ్ సి లు పర్యవేక్షించి గ్రామ స్థాయి లో, మండల స్థాయి లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ రుణ మాఫి పై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.జిల్లా స్థాయి అధికారులు బదిలీలపై వెళ్లిన అధికారులను  వెంటనే విడుదల చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు.జిల్లా కలేక్టర్ పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను శాఖల వారిగా చదివి వినిపించారు.ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులు భూ సమస్య లపై 38 దరఖాస్తులు, డి. ఆర్. డి. ఓ 12, డి యం హెచ్ ఓ 8, ఇతర శాఖలకు సంబంధించి 22, మొత్తం 80 దరఖాస్తు లు అందాయని సంబంధిత శాఖలకు తదుపరి చర్యలకై పంపించటం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సి ఈ ఓ అప్పారావు,డి ఆర్ డి ఓ మధు సూదన్ రాజు, డి ఈ ఓ ఆశోక్, డి డబ్ల్యూ ఓ వెంకటరమణ,సంక్షేమ అధికారులు శంకర్, లత, వివిధ శాఖల అధికారులు, ఆర్జిదారులు తదితరులు పాల్గొన్నారు.